రాయికల్, 26 September
జగిత్యాల జిల్లా మండలం అల్లీపూర్ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
జగిత్యాల జిల్లా మండలం అల్లీపూర్ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చూపిన ధైర్యసాహసాలు, హక్కుల కోసం చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక యువజన సంఘం అధ్యక్షులు ఓరగంటి రాజు, ఉపాధ్యక్షులు గొల్లపెల్లి రాజేశం, రజక సంఘం పెద్దలు మాదాసు గంగారాం, గొల్లపల్లి లింగన్న పాల్గొన్నారు. అలాగే రజక యూత్ సభ్యులు గొల్లపెల్లి రాజేష్, నరేష్, నవీన్, ప్రవీణ్, మాదాసు లక్ష్మణ్, రాజు, గంగాధర్, ఓరగంటి గంగాధర్, గొల్లపెల్లి శేఖర్, శ్రీకాంత్, గొల్లపెల్లి మహేష్‌తో పాటు గ్రామానికి చెందిన పలువురు రజక సంఘం సభ్యులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

