హైదరాబాద్ సిటీ: పేపర్ ప్లేట్లలో వేడి వేడి ఫుడ్ తింటున్నారా అయితే మీరు క్యాన్సర్‌ను కొని తెచ్చుకున్నట్లే. ప్లాస్టిక్ రంగుల పూతతో ఉన్న పేపర్ ప్లేట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వేడి వేడి అన్నం కూరలు వీటిలో వడ్డించినప్పుడు ప్లేట్లలోని రసాయనాలు కరిగి నేరుగా మన కడుపులోకి చేరుతున్నాయి. దీర్ఘకాలంలో ఇవి ప్రాణాంతక క్యాన్సర్లకు దారితీస్తున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాగితం నానిపోకుండా నూనె కారకుండా తయారీదారులు వాటికి పాలిథిన్ కోటింగ్ లేదా కృత్రిమ రంగులను వాడుతున్నారు.

ఈ ప్లేట్లలో ఎక్కువ వేడి ఉన్న ఆహార పదార్థాలు వడ్డించినప్పుడు ఆ కెమికల్స్ కరిగి ఆహారంలో కలిసిపోతున్నాయి. ఇవి క్రమంగా జీర్ణవ్యవస్థలోకి వెళ్లి లివర్ ప్యాంక్రియాస్ క్యాన్సర్లకు మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్‌కు దారితీస్తున్నాయని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. దీనికి తోడు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతోంది. ఐసీఎంఆర్ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అంచనాల ప్రకారం 2025లో తెలంగాణలో దాదాపు 50 వేల పైనే క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 29 వేల మందికి పైగా వివిధ రకాల క్యాన్సర్లతో చనిపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఏమిటీ ఈ కెమికల్
కలర్ పేపర్ ప్లేట్లను ఎక్కువగా వినియోగిస్తే అందులో ఉండే బిస్ఫినాల్ అనే కెమికల్ మనిషి శరీరంలోకి చేరుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధులైన కాలేయ క్యాన్సర్ కిడ్నీల రోగాలతో పాటు నర్వ్ సిస్టమ్‌ను దెబ్బతీస్తుంది. కాగితపు ప్లేట్లను బయో ప్లాస్టిక్ పెట్రోలియం ప్లాస్టిక్ పూతతో తయారు చేయడం వల్ల వేడి ఆహారం తినే సమయాల్లో ఈ కోటింగ్ రసాయనంగా మారి శరీరాల్లోకి చేరి అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది.