జగిత్యాల మండలం పరిధిలోని ధర్మారం గ్రామంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పరమాల సుమలత, మల్లేశం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు, బాల కార్మికుల నిర్మూలనపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.
జగిత్యాల మండలం పరిధిలోని ధర్మారం గ్రామంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పరమాల సుమలత, మల్లేశం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుమలత, మల్లేశం మాట్లాడుతూ, గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. గ్రామంలో కొత్తగా ఉపాధి పనులను గుర్తించి, అవసరమైన వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేయాలని, బాలల హక్కులను కాపాడాలని సూచించారు. ముఖ్యంగా బాల్య వివాహాలు చేయకూడదని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ ప్రతిజ్ఞ ద్వారా గ్రామంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దీకొండ ప్రేమ్ నాథ్, కార్యదర్శి తిరుపతి, కారోబార్ వినోద్, వార్డు సభ్యులు కోరేపు రాజకుమార్, గిద్దె లత, ధనేశ్వరరావు, మేఘన, సుగుణ, ఏఎన్ఎం అంగన్వాడి టీచర్ గీత, ఆశా వర్కర్ సుజాత, గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది, యువత తదితరులు పాల్గొన్నారు.


