పల్లె వాణి నరసింహులపేట మండల కేంద్రంలో రావణ ఉత్సవ కమిటీ ఎన్నిక ఈరోజు ఉదయం 11:30 గంటలకు జరిగింది. గత కొన్నేళ్లుగా ఘనంగా జరుగుతున్న ఈ ఉత్సవాలను ఈ సంవత్సరం కూడా నిర్వహించేందుకు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నరసింహులపేట మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ, మండల ప్రజలు రావణ దహనంతో పాటు ఆడపడుచుల కోలాటాలు, నృత్యాలతో రావణ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదే రీతిలో నిర్వహించేందుకు ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఉత్సవ కమిటీ ఎన్నిక జరిగింది.
కొత్త కమిటీ సభ్యుల వివరాలు
ఈ ఎన్నికలో శాశ్వత విగ్రహదాతగా ఎర్ర వెంకటేశ్వర్లు, అధ్యక్షులుగా ఎర్ర వెంకట్ రామ్ నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా చామకూరి శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా శ్రీను, కోశాధికారిగా కాశీ యాకయ్య, కార్యదర్శిగా ఆవుల మహేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గత ఉత్సవాల విశిష్టతను, ఈ ఏడాది నిర్వహణపై సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
గౌరవ సలహాదారులుగా గుండాల బిక్షం, దాస రోజు నాగేంద్ర చారి, గౌని యాదగిరి, హనుమండ్ల వెంకటరెడ్డి, రేఖ అనిల్, ఆకుతోట నరేష్ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా అనిల్, ప్రభాకర్, సోమేశ్, రఘు, మై పాషా, య క స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే రావణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయని సభ్యులు తెలిపారు.












