జగిత్యాల జిల్లా మండలం అల్లీపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం మానవత్వాన్ని చాటుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన 4వ వార్డు నివాసి టోపీ నారాయణ అంత్యక్రియలను సర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో పూర్తి చేశారు.
అల్లీపూర్ గ్రామానికి చెందిన టోపీ నారాయణ అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ పాలకవర్గం, సర్పంచ్, వార్డు సభ్యులు తక్షణమే స్పందించారు. జేసీబీని ఏర్పాటు చేసి, పూడిక తీసి టోపీ నారాయణ అంత్యక్రియలు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ మానవతా దృక్పథం గ్రామస్థులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో 4వ వార్డు సభ్యులు కల్లెడ గంగాధర్, 2వ వార్డు సభ్యులు జాగిరి ప్రశాంత్, ఎంబారి వెంకటేష్, పారిశుధ్య సిబ్బంది శంకర్, లచ్చం, ఆషు తదితరులు పాల్గొన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని, సర్పంచ్, వార్డు సభ్యులను గ్రామస్థులు మనస్ఫూర్తిగా అభినందించారు.












