సిరిసిల్ల, 2026-09-15
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి రూ.10.63 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు కావడాన్ని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి స్వాగతించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.
సిరిసిల్లకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కిేకే మహేందర్ రెడ్డి. రాజన్న రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసి, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం కు 10.63 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ప్రభుత్వ పాఠశాలను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్ది, ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. టీజీపీఎస్ల అభివృద్ధికి కేటాయించిన నిధులతో పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అనుకూలమైన అభ్యసన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. 2026–27 రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం రాష్ట్ర వాటా కింద రూ.209.969 కోట్లను కేటాయించి విడుదలకు అనుమతించడంతో పాటు, మిగిలిన 70 శాతం అంటే రూ.489.926 కోట్లను అంచనా వేసిన ఏఐబి రుణం నుంచి వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం విద్యారంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని కేకే మహేందర్రెడ్డి అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యా వసతులు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని కొనియాడారు. విద్యారంగ అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రాధాన్యం ఇస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్ తరాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన అన్నారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలను మరింత పెంచే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నానని కేకే మహేందర్రెడ్డి పేర్కొన్నారు.

