
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో మిషన్ భగీరథ పథకం కింద ఏర్పాటు చేసిన వాటర్ పైపులైన్ లీక్ అవ్వడంతో నీరు వృధాగా రోడ్లపైకి ప్రవహిస్తున్నాయి. గ్రామంలోని కచేరి వద్ద ఈ పైపులైన్ లీకేజీ ఏర్పడింది. దీనివల్ల అమూల్యమైన నీరు వృధాగా పోవడమే కాకుండా, రోడ్లపై నీరు నిలిచి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.



















