దసరా పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లేవారు తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. పండుగ సీజన్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
దసరా పండుగ సందర్భంగా చాలామంది తమ స్వగ్రామాలకు, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారని, ఇదే అదనుగా భావించి దొంగలు ఇళ్లలో చోరీలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ సూచించారు. పండుగకు ఊళ్లకు వెళ్లే వారు తమ ఇళ్ల భద్రత విషయంలో ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
జిల్లా పరిధిలో చోరీల నియంత్రణకు పోలీసు శాఖ తరఫున అన్ని అవసరమైన చర్యలు చేపడుతున్నామని, రాత్రి వేళల్లో పోలీసు గస్తీని ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 112 కు సమాచారం అందించాలని కోరారు.
ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం బయటకు కనిపించకుండా పరదా కప్పి ఉంచాలి. మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసి.. పక్క డోర్లకు తాళం వేయడం మంచిది.
ఊరు వెళ్లేముందు ఇంట్లో బంగారు, వెండి, డబ్బు వంటి విలువైన వస్తువులను బీరువాలో పెట్టకూడదు. బ్యాంకు లాకర్లలో దాచుకోవడం మంచిది.
విలువైన వస్తువులు, వ్యక్తిగత ఆర్థిక విషయాల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు.
బీరువా తాళాలు ఇంట్లో కప్ బోర్డులు లేదా ఇతర ప్రదేశాలలో ఉంచకూడదు.
ఊరు వెళితే ఇంటి పక్కనవారికి, సంబంధిత పోలీసులకు సమాచారం అందించడం ద్వారా రాత్రి సమయాల్లో గస్తీ తిరగడానికి వచ్చినప్పుడు ఇంటి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
రాత్రి సమయంలో ఏదైనా ఒక రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉండేలా ఆన్ చేసి ఉంచాలి.
అనుమానిత లేదా కొత్త వ్యక్తులు ఇంటి చుట్టూ తిరగడం కనిపిస్తే వెంటనే 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి.
మీ మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చేలా.. ఇంటికి సీసీ కెమెరా అమర్చుకోవాలి. ఇంటి బయట నాలుగు దిక్కులు కవర్ అయ్యేలా కెమెరాలు అమర్చుకోవాలి.
చుట్టుపక్కల వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం, ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
ఇంట్లో ఎవరైనా మహిళలు, వృద్ధులు ఉన్నప్పుడు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని చెప్పాలి.









