సారాంశం
మండలం అల్లీపూర్ పోచమ్మవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో ఆరో రోజు అమ్మవారు సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ముఖ్య విషయాలు
- 1అల్లీపూర్ లో అమ్మవారికి ఘనంగా బోనాలు
మండలం అల్లీపూర్ పోచమ్మవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
- 2నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో ఆరో రోజు అమ్మవారు సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
- 3ఈ సందర్భంగా పురోహితులు అంగడి పరమేశ్వర్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
- 4అనంతరం సాయంత్రం గ్రామ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో బోనాలను తలపై ఎత్తుకొని డీజే చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తరలివచ్చి నవదుర్గ అమ్మవారికి సమర్పించారు.
మండలం అల్లీపూర్ పోచమ్మవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో ఆరో రోజు అమ్మవారు సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా పురోహితులు అంగడి పరమేశ్వర్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం గ్రామ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో బోనాలను తలపై ఎత్తుకొని డీజే చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తరలివచ్చి నవదుర్గ అమ్మవారికి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో నవదుర్గ సేవా సమితి సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.