జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం శ్రీ సాయి మందిరంలో 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగిన ఈ వేడుకల్లో భాగంగా ఉదయం బాబా వారికి మంగళ స్నానం, సుప్రభాత సేవ, కాకడ హారతి, విగ్నేశ్వర పూజ, జ్యోతి ప్రజ్వలన వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
ఆలయంలో 24 గంటల పాటు సాయి నామ సంకీర్తన కొనసాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భగవంతుని కృపకు పాత్రులయ్యారు. ఏకాహం దాతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు పంచామృత, ఫలరసాలతో అభిషేకాలు, ప్రత్యేక పుష్పాలంకరణ, సహస్రనామ పూజలు, ఆధ్యాత్మిక సందేశాలు, సాయి సత్సంగం, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొదటిరోజు జరిగిన వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ నిష్ఠతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షిరిడి సాయిబాబా మందిర సమితి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తీర్థ ప్రసాదాల వినియోగంతో మొదటి రోజు కార్యక్రమాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పందిరి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి అనంతల కృష్ణయ్య, కమిటీ సభ్యులు, దాతలు పాల్గొన్నారు.












