హనుమకొండ, 2026-08-14
హనుమకొండ మండలం ప్రాతాప్నగర్లోని శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి పోచమ్మతల్లి దేవాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలను ఈ నెల 18, 19 తేదీల్లో వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. రెండు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు, విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
హనుమకొండ మండలం ప్రాతాప్నగర్లోని శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి పోచమ్మతల్లి దేవాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలను ఈ నెల 18, 19 తేదీల్లో వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. రెండు రోజుల పాటు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు, విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గ్రామోత్సవంతో ప్రారంభం
మహోత్సవాలకు ముందుగా ఈ నెల 16వ తేదీ ఉదయం 6 గంటలకు వైష్ణవపురం దేవాలయం నుంచి గ్రామోత్సవాన్ని నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
18న ఆధ్యాత్మిక కార్యక్రమాలు
18వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, మూర్తి కుండస్థాపన, జలాధివాసం, మూలమంత్ర హవనం, అధివాస హోమం, పూర్ణాహుతి, దేవాలయ ప్రాంగణ శుద్ధి తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు పంచకలశ స్థాపన, క్షీరాధివాసం, మూలమంత్ర హవనం, అధివాస హోమం, ఫలపుష్పాధివాసం, తీర్థప్రసాదాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
19న విగ్రహ ప్రతిష్ఠాపన
19వ తేదీ బుధవారం ఉదయం 6.15 గంటలకు మూలమంత్ర హవనం, గర్భన్యాస హోమం, లోకశ్రేయస్సు హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 7.45 గంటలకు యంత్రస్థాపన, పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, మూలమంత్రాభిషేకం, దృశ్యకుంభాభిషేకం, దేవతా మూర్తుల దర్శనం, మహామంగళహారతి, తీర్థప్రసాదాల పంపిణీ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.
భక్తులకు పిలుపు
మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమాలలో వాకర్ అసోసియేషన్, మాజీ కార్పొరేటర్ బీజేపీ నాయకులు నార్ల గిరి రామలింగం, పంజాల అశోక్ కుమార్, గుండెపు రవీందర్, ఆంజనేయలు, వెంకటేశ్వర్లు, శంకరయ్య, మధులత, సమ్మయ్య, రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు.












