నాగార్జునసాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో సోమవారం రోజు వరుణ యాగం నిర్వహించనున్నారు. ఈ యాగం యొక్క పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి, 2.45 గంటలకు నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి యాగం జరిగే విజయ్ విహార్ ప్రాంగణానికి చేరుకుంటారు.
పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం
మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. యాగం ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆయన హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నారు.
యాగ విశేషాలు
విజయ్ విహార్‌లో 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో వరుణ యాగం జరగనుంది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించబడుతుంది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పంతో ఈ వరుణయాగాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.










