నల్గొండ, 2026-08-09
రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం నాగార్జున సాగర్ లో సాగర్ విజయ్ విహార్ ఆవరణలో కృష్ణా నది ఒడ్డున నిర్వహిస్తున్న నాగార్జుననాగార్జున సాగర్ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా సర్వంసిద్ధం-కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం ఆయన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్‌తో కలిసి యాగం ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ విజయ్ విహార్ ఆవరణలో కృష్ణా నది ఒడ్డున నిర్వహిస్తున్న వరుణ యాగానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం ఆయన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్‌తో కలిసి వరుణ యాగం ఏర్పాట్లను మరోసారి పర్యవేక్షించారు.
ఏర్పాట్ల పరిశీలన
ముందుగా బీసీ సంక్షేమ హాస్టల్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం విజయ్ విహార్ వెనుక వైపున కృష్ణానది ఒడ్డున ఏర్పాటు చేసిన వరుణ యాగానికి సంబంధించిన యాగశాల, హోమ గుండాలు, యాగాన్ని నిర్వహించేందుకు హాజరవుతున్న 108 మంది రుత్వికులకు అవసరమైన ఆసనాలు, యాగానికి అవసరమైన సామాగ్రి, పగోడాలు, బ్యారికేడ్ బందోబస్తు, ఎల్ఈడీ స్క్రీన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టం వంటి అన్నింటినీ ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. యాగం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
యాగం వివరాలు
మీడియా ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాగం సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 3 గంటల 20 నిమిషాలకు పూర్తవుతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లతో పాటు, బందోబస్తు, అన్ని శాఖల ద్వారా ఏర్పాట్లను పూర్తిచేసినట్లు కలెక్టర్ తెలిపారు. వరుణ యాగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, ప్రజలు యాగాన్ని వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ఏర్పాటు చేశామని, అంతేకాక విజయ్ విహార్ ఆవరణలోనే ప్రవచనాలు కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
శాసనసభ్యుల పరిశీలన
వరుణ యాగం ఏర్పాట్లను నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాట్లపై అధికారులతో ఆరా తీయడమే కాకుండా, ప్రత్యక్షంగా ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు.
పోలీసు బందోబస్తు
రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా అవసరమైన పోలీస్ బందోబస్తు, భద్రతలను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలన్నీ తీసుకోవాలని, పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం వరుణ యాగం సందర్భంగా విజయ్ విహార్‌కు వచ్చే ప్రతి ఒక్కరికి ప్రవేశ పాసు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, పాస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.










