రాయికల్ పట్టణానికి చెందిన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మౌనికకు చికిత్స నిమిత్తం రూ.2 లక్షల ఎల్వోసీని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అందజేశారు. సీఎం సహాయనిధి ద్వారా ఈ ఆర్థిక సహాయం మంజూరైంది.
రాయికల్ పట్టణానికి చెందిన బి. మౌనిక, అల్లిపూర్ గ్రామానికి చెందినవారు. ఆమె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ, చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం స్థానిక నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ వెంటనే స్పందించి, సీఎం సహాయనిధి ద్వారా మౌనిక చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్వోసీని మంజూరు చేయించారు.
జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మౌనిక కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల విలువైన సీఎం సహాయనిధి ఎల్వోసీని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా మౌనిక కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమిండ్ల శ్రీనివాస్, గంగాధర్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.












