బుగ్గారం అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రాసన కార్యక్రమం, హెచ్ఆర్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నక్క రాజవ్వ, ఉప సర్పంచ్ జంగ లావణ్య హాజరయ్యారు. పిల్లల బరువు తనిఖీ, పౌష్టికాహారం ప్రాముఖ్యతపై వారు సూచనలు చేశారు.
బుగ్గారం అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రాసన కార్యక్రమం, హెచ్ఆర్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నక్క రాజవ్వ, ఉప సర్పంచ్ జంగ లావణ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నక్క రాజవ్వ మాట్లాడుతూ, ప్రతి నెలా 1వ తేదీ నుండి 5వ తేదీ లోపు పిల్లలను అంగన్వాడి కేంద్రానికి తీసుకువచ్చి వారి బరువును తప్పనిసరిగా తనిఖీ చేయించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రానికి పిల్లలను పంపించడం ద్వారా వారిలో మానసిక, శారీరక, మేధోశక్తి అభివృద్ధి చెందుతుందని, ఆటపాటలతో కూడిన విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు.
ఉప సర్పంచ్ జంగ లావణ్య మాట్లాడుతూ, ఆరు నెలలు నిండిన పిల్లలకు తల్లిపాలతో పాటు బాలామృతం కూడా తినిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నక్క రాజవ్వ, ఉప సర్పంచ్ జంగ లావణ్యతో పాటు అంగన్వాడి టీచర్లు సరిత, కరుణశ్రీ, మంజుల, ఆయా లక్ష్మి, ఆశా కార్యకర్త సత్తవ్వ, గర్భిణీలు, తల్లులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






