Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 28
ఖమ్మం-హైదరాబాద్ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నాన్‌స్టాప్ ఏసీ బస్సుల సర్వీసులను 33 నుంచి 44 ట్రిప్పులకు పెంచుతూ అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్సుల ద్వారా ప్రయాణికులు సుమారు 3 గంటల్లో గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
ఖమ్మం-హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. ఈ మార్గంలో నాన్‌స్టాప్ ఏసీ బస్సులకు ప్రయాణికుల నుంచి పెరుగుతున్న ఆదరణ, రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు అదనంగా మరిన్ని ట్రిప్పులను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. గతంలో 33 ట్రిప్పులు ఉండగా ఇప్పుడు 44 ట్రిప్పులకు పెంచడం జరిగింది. ఈ సర్వీసులు ఖమ్మం నుండి ఎల్బీనగర్ చేరుకోవడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది.
ఖమ్మం నాన్‌స్టాప్ ఏసీ బస్సుల బయలుదేరు సమయాలు
04:00, 04:20, 04:40, 05:00, 05:20, 05:40, 06:00, 06:30, 07:00, 07:30, 08:00, 08:30, 09:00, 09:30, 10:00, 10:30, 11:00, 11:30, 12:00, 12:30, 13:00, 13:30, 14:00, 14:30, 15:00, 15:30, 16:00, 16:30, 17:00, 17:30, 18:00, 18:30, 19:00, 19:30, 20:00, 20:30, 21:00, 21:20, 21:40, 22:00, 22:20, 22:40, 23:00, 23:30 గంటలకు.
ఖమ్మం నాన్‌స్టాప్ ఏసీ బస్సుల బయలుదేరు సమయాలు
00:10, 01:00, 04:30, 05:00, 05:30, 06:00, 06:30, 07:00, 07:30, 08:00, 08:30, 09:00, 09:30, 10:00, 10:30, 11:00, 11:30, 12:00, 12:30, 13:00, 13:30, 14:00, 14:30, 15:00, 15:20, 15:40, 16:00, 16:20, 16:40, 17:00, 17:30, 18:00, 18:30, 19:00, 19:30, 20:00, 20:30, 21:00, 21:20, 21:40, 22:00, 22:30, 23:00, 23:30 గంటలకు.
ముందస్తు రిజర్వేషన్ల కోసం .. వెబ్సైట్ ద్వారా మీ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ నాన్‌స్టాప్ ఏసీ బస్సుల ద్వారా ఖమ్మం-హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన, మెరుగైన ప్రయాణ అనుభవం అందుబాటులోకి వస్తుందని ఖమ్మం డిపో మేనేజర్ శివ ప్రసాద్ తెలిపారు.

