మధిర, 2026-11-20
మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఎస్కే షమీనా (31) అనే మహిళ 108 అంబులెన్స్‌లో ప్రసవించారు. మార్గమధ్యలో నొప్పులు తీవ్రం కావడంతో ఈఎంటీ కళ్యాణి చాకచక్యంగా వ్యవహరించి అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం చేయించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఎస్కే షమీనా (31) రెండో కాన్పు నిమిత్తం గత రాత్రి పురిటినొప్పులతో మధిర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు ఆమెను 108 అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో నొప్పులు తీవ్రం కావడంతో బోనకల్ మండలం జానకీపురం సమీపంలో ఈఎంటీ కళ్యాణి చాకచక్యంగా అంబులెన్స్‌లోనే ప్రసవం చేయించారు. షమీనా మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. అనంతరం ఈఎంటీ కళ్యాణి, పైలట్ రవీంద్రబాబు తల్లీబిడ్డను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి సురక్షిత ప్రసవానికి సహకరించిన 108 సిబ్బందికి బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


