జిల్లా కోదాడ పట్టణంలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తుల నుంచి సుమారు 120 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు కోదాడ టౌన్ పోలీసులు వలపన్ని ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి నుంచి బెంగళూరుకు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నట్లు సమాచారం. గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

