Jagtial/Jagityal Rural (ధర్మ రథం) సెప్టెంబర్ 11
సోషల్ మీడియా ట్రెండ్స్ లో మరో కొత్త ఫ్యాషన్ ట్రెండ్ జగిత్యాల : వాట్సాప్ స్టేటస్ లలో 1980 లుక్ తో వున్న ఫోటోలను పోస్ట్ చేయడం నెటిజన్లలో ఆసక్తికర ట్రెండ్ గా మారింది
సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న 1980's ఫొటోస్ ట్రెండ్. జగిత్యాల :సోషల్ మీడియా ట్రెండ్స్ లో మరో కొత్త ఫ్యాషన్ ట్రెండ్ నడుస్తుంది.ప్రస్తుతం వాట్సాప్ స్టేటస్ లలో 1980's లుక్ తో వున్న ఫోటోలను పోస్ట్ చేయడం నెటిజన్లలో ఆసక్తికర ట్రెండ్ గా మారింది.అప్పటి కాలం నాటి హెయిర్ స్టైల్, డ్రెస్స్, కళ్ళదాలు 1980's ను గుర్తు చేసేలా ఫోటోలు AI ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్పిడి చేసి స్టేటస్ లు పెడుతున్నారు. ముఖ్యంగా పాతకాలపు స్టైల్ కు ఆధునిక టెక్నాలజీని జోడించి ఫోటోలకు 2980's కాలపు ఫిల్మ్ లుక్, కలర్స్,బ్యాక్ గ్రౌండ్ తీసుకొస్తున్నారు.దీంతో ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ నెటిజెన్లు తమ పాత కాలం గుర్తు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఆల్బమ్ లలో మాత్రమే కనిపించిన పాతకాలపు ఫోటో స్టైల్.. ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ లలో కొత్త ట్రెండ్ గా మారడం విశేషం.వయసుతో సంబంధం లేకుండా పలువురు ఈ రేట్రో లుక్ ను ఆశ్వదిస్తూ తమ ఫోటోలను సోషల్ మీడియా లో పంచుకుంటున్నారు.పాతకాలపు స్టైల్ కు కొత్త తరం టచ్ ఇవ్వడమే ఈ ట్రెండ్ ప్రత్యేకతగా నిలుస్తుంది.












