అభినందించిన (ధర్మ రథం) సెప్టెంబర్ 16
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం పోక్సో ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. నిందితుడికి రూ.15 వేల జరిమానా కూడా విధించింది.
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు అనంతపురం పోక్సో () ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది.
కేసు వివరాలు: అనంతపురం కక్కలపల్లి పంచాయతీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలికపై 2021లో లైంగిక దాడి జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అనంతపురం మహిళా పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 11/2021గా కేసు నమోదు చేశారు.
సమగ్ర విచారణ అనంతరం నిందితుడిపై మోపబడిన అభియోగాలు రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష విధించింది.
ప్రధాన నిందితుడికి శిక్ష
అనంతపురం బిజెపి కొట్టాలకు చెందిన ప్రధాన నిందితుడు (-1) జోన్న వెంకటేష్‌కు 366, 376 మరియు పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే మరో 4 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది.
బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం
బాధితురాలికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా (నష్టపరిహారం) మంజూరు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పోలీసులకు ఎస్పీ అభినందనలు
ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి ఐఓ కె. ధరణి కిషోర్ (ప్రస్తుతం ఎస్బీ ఇన్స్పెక్టర్), ఎ. శ్రీనివాసులు (ప్రస్తుతం తిరుపతి అడిషనల్ ఎస్పీ), పర్యవేక్షణ అధికారి డీఎస్పీ ఎం. శివప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ డి. కిరణ్ కుమార్ ( 2530) లను జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ అభినందించారు.
బాలలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని అనంతపురము జిల్లా పోలీసులు తెలిపారు.


