Rajanna Sircilla/Mustabad (ధర్మ రథం) సెప్టెంబర్ 19
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వాత్సల్య ఫౌండేషన్ కు ఉత్తమ సేవ అవార్డు 2026 లభించింది. భారత్ రక్తదాన్ సేవా మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఈ అవార్డును ఫౌండేషన్కు అందజేశారు. గత 8 సంవత్సరాలుగా నిరంతరాయంగా రక్తదాన సేవలు అందిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించింది.
భారత్ రక్తదాన్ సేవా మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో వాత్సల్య ఫౌండేషన్కు ఉత్తమ సేవ అవార్డు2026 లభించింది.
గత 8 సంవత్సరాలుగా నిరంతరంగా రక్తదాన సేవలను అందిస్తూ, ఇప్పటివరకు 6,056 రక్తదానాలను పూర్తి చేసిన వాత్సల్య ఫౌండేషన్ సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేశారు.
అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి స్వచ్ఛంద రక్తదాతలను సమకూర్చుతూ, ప్రాణాలను కాపాడేందుకు ఫౌండేషన్ చేస్తున్న సేవలను నిర్వాహకులు ప్రశంసించారు.
ఫౌండర్ ప్రతిస్పందన
ఈ సందర్భంగా వాత్సల్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆకారపు సుధాకర్ మాట్లాడుతూ, ఈ అవార్డు తమ సభ్యులు, రక్తదాతలు మరియు సేవాభావంతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ దక్కిన గౌరవమని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరింత మంది రక్తదాతలను ప్రోత్సహిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.


