తెలంగాణ ప్రభుత్వం జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు చేసిన ప్రతిష్టాత్మక యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఈ నెల 25న శంకుస్థాపన జరగనుంది. తాటిపల్లిమొరపల్లి శివారులో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.
జగిత్యాల నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను తాటిపల్లిమొరపల్లి శివారులోని 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 25వ తేదీ ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.
నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో, జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ మండల, స్థానిక నాయకులతో కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ స్థలాన్ని, శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించే సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు.
నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు
జగిత్యాల నియోజకవర్గానికి ప్రతిష్టాత్మకమైన ఈ పాఠశాల మంజూరు కావడం సంతోషకరమని, 25 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో పాఠశాల ఏర్పాటుతో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులు, స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
విద్యార్థుల భవిష్యత్తుకు గొప్ప వరం
జగిత్యాల జిల్లా నియోజకవర్గ విద్యార్థుల భవిష్యత్తుకు ఈ యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక గొప్ప వరంగా నిలుస్తుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గజంగి నందయ్య, చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, చైర్మన్ కొలుగూరి దామోదర్ రావు, సెక్రటరీ బండ శంకర్, మాజీ జడ్పీటీసీ పెండెం రాములు, సర్పంచులు కట్ట రాజేందర్, గంగారెడ్డి ఆనంద్ రెడ్డి, హకీం, మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం, మాజీ చైర్మన్ నక్కల రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు సమీండ్ల శ్రీనివాస్, వైస్ చైర్మన్ అబ్బూరి మల్లేశం, అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు భూమా రెడ్డి, కౌన్సిలర్లు తిరుమలయ్య, కమల్, డైరెక్టర్ గడ్డం గంగారెడ్డి, డైరెక్టర్లు నీరటి గంగారెడ్డి, శ్రీనివాస్, నలువల సురేష్, తిరుపతి, దాసరి సతీష్, నరేష్, మాజీ సర్పంచ్ గంగారం, సదానందం, టిల్లు, ప్రవీణ్ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


