సూర్యాపేట, 2026-11-05
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా, సూర్యాపేట జిల్లాలో వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ తెలిపారు. ఈ కాలంలో ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిర్వహించరాదని ఆయన ఆదేశించారు.
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా, జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, జిల్లాలో ఉన్న ప్రశాంత వాతావరణం భంగం కాకుండా, సవ్యంగా కొనసాగించడానికి ఈనెల 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున, జిల్లాలో డిఎస్పి లేదా ఆ పై స్థాయి అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించరాదని, సన్నాహాలు చేయరాదని తెలిపారు.
నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, దుడ్డు కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, దురుద్దేశంతో నేరాలను ప్రేరేపించే ఆయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే ప్రజా సమావేశాలు, జన సమూహాలు పూర్తిగా నిషేధించబడ్డాయని తెలిపారు. అధిక శబ్దం వచ్చే స్పీకర్లు, డీజేలు వంటి వాటికి అనుమతులు లేవని, ప్రచార రథాలు, మైకులు, తదితర అధిక శబ్దం పరికరాలు నిషేధించబడ్డాయని సూచించారు.
చట్ట ప్రకారం జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తప్పవని సూచించారు. నిబంధనలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందాలని సూచించారు.


