బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ (ధర్మ రథం) సెప్టెంబర్ 28
మయన్మార్, అండమాన్ మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ఇది రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 72 గంటల్లో ఈశాన్య బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
మయన్మార్, అండమాన్ మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ఇది రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు ఈశాన్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం రాగల 72 గంటల్లో ఈశాన్య బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.












