హైదరాబాద్‌లో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లేలా వ్యవహరిస్తున్న 8 రెస్టారెంట్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. బృందాలు నిర్వహించిన తనిఖీల్లో అపరిశుభ్రత, బొద్దింకలు, ఎలుకలు వంటివి బయటపడటంతో ఈ సంస్థల ఫుడ్ లైసెన్సులను సస్పెండ్ చేశారు.
నగరంలో కు చెందిన 8 బృందాలు 15 రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీలలో అనేక చోట్ల బొద్దింకలు, ఈగలు, ఎలుకలు, వాటి విసర్జితాలు కనిపించాయి. తీవ్రమైన అపరిశుభ్రతతో పాటు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరగాయలు, అపరిశుభ్రమైన పాత్రలు, సరిగా నిర్వహించని డ్రైనేజీ వ్యవస్థలు, స్టోరేజ్-లేబులింగ్ లోపాలను అధికారులు గుర్తించారు.
కల్తీ అనుమానంతో 16 ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నిబంధనలు పాటించని 8 సంస్థల లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేస్తూ, వాటి వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మరో 5 సంస్థలకు గుర్తించిన లోపాలను సవరించుకోవడానికి ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేయనున్నారు. బాచుపల్లిలోని లక్కీ రెస్టారెంట్లో భారీగా బొద్దింకలు, అపరిశుభ్ర పరిస్థితులు కనిపించడంతో పాటు, లైసెన్స్ లేకుండానే నిర్వహిస్తున్నట్లు గుర్తించి, ఆ రెస్టారెంట్‌ను అధికారులు మూసివేశారు. తనిఖీల్లో బయటపడిన గడువు ముగిసిన ఆహార పదార్థాలను అక్కడికక్కడే పారవేశారు.










