కోరుట్ల, 18 July
ఐలాపూర్ గ్రామంలో వ్యవసాయానికి సరైన విద్యుత్ సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతుండటంతో, అధికారుల తీరుపై మండిపడుతూ గ్రామ ప్రజలు, రైతులు ఏకమై సబ్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాయకష్టాన్ని నమ్ముకుని, పగలు రాత్రి తేడా లేకుండా సమాజానికి అన్నం పెట్టే రైతులు నేడు రోడ్డెక్కారు. కరెంట్ కోతలతో పంటలు ఎండుతుండటంతో ఆవేదనకు గురైన ఐలాపూర్ గ్రామ ప్రజలు మరియు రైతులు, తమ సమస్యను పరిష్కరించాలంటూ సబ్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు.
ఐలాపూర్ గ్రామంలో వ్యవసాయానికి సరైన విద్యుత్ సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతుండటంతో, అధికారుల తీరుపై మండిపడుతూ గ్రామ ప్రజలంతా ఏకమై రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు.
"ఎండనక, వాననక ప్రాణాలను పణంగా పెట్టి సాగు చేస్తున్నాం. కానీ, కనీసం పంటకు నీరు పెట్టేందుకు కూడా కరెంట్ ఇవ్వకపోతే ఎలా?" అంటూ రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. సబ్ స్టేషన్ వద్ద వారు చేపట్టిన ధర్నా, కేవలం ఒక నిరసన మాత్రమే కాదు.. తమ బతుకు పోరాటమని వారు స్పష్టం చేశారు. తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే వరకు వెనక్కి తగ్గేది లేదని వారు తేల్చిచెప్పారు.
రైతుల కన్నీరు దేశాభివృద్ధికి ఏమాత్రం మంచిది కాదని, కష్టపడే రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ మరియు అధికారుల బాధ్యత. ఐలాపూర్ రైతుల ఆవేదనను గుర్తించి, విద్యుత్ సరఫరాలో నెలకొన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ధర్మం తమ వైపే ఉందని, అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.






