హైదరాబాద్, 13 July
రాష్ట్రంలోని చిన్నారుల్లో నులిపురుగుల సమస్యను పూర్తిగా నిర్మూలించి, వారి ఆరోగ్య పరిరక్షణకు వైద్య, ఆరోగ్య శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి 'అల్బెండజోల్' మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తోంది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలోని చిన్నారుల్లో నులిపురుగుల సమస్యను పూర్తిగా నిర్మూలించి, వారి ఆరోగ్య పరిరక్షణకు వైద్య, ఆరోగ్య శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి 'అల్బెండజోల్' మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తోంది.
ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారికంగా ప్రారంభించనున్నారు.
పెరుగుతున్న చిన్నారుల్లో రక్తహీనత, పోషకాహార లోపానికి ప్రధాన కారణమైన నులిపురుగుల సమస్యను నివారించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అర్హులైన చిన్నారులందరికీ ఈ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
కేవలం మాత్రలు ఇవ్వడమే కాకుండా, నులిపురుగుల వల్ల కలిగే అనర్థాలు, పరిశుభ్రత ప్రాముఖ్యత మరియు ఈ నివారణ మార్గాలపై చిన్నారులకు, తల్లిదండ్రులకు విస్తృత అవగాహన కల్పించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ మాత్రలను వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.







