అన్నమయ్య, 9 September
ప్రేమ పేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను నమ్మించి, రూ. 40 లక్షల నగదుతో పాటు కారును తీసుకుని, వేరే మహిళతో నిశ్చితార్థం చేసుకున్న ప్రియుడి తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
*కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం..* ప్రియుడు చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం! నమ్మినందుకు రూ.40 లక్షలు ఊడ్చేసి, కారు తీసేసుకుని, వేరే పెళ్లికి సిద్ధపడటంతో జిల్లాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. బాధితురాలు ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రేమ పేరుతో దగ్గరైన ప్రియుడిని గుడ్డిగా నమ్మింది. అతడి అవసరాల కోసం ఏకంగా రూ. 40 లక్షల నగదు ఇవ్వడమే కాకుండా, తిరగడానికి సొంత డబ్బులతో కారు కూడా కొనిచ్చింది. డబ్బులు, కారు దక్కాక ప్రియుడు ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. రహస్యంగా వేరే మహిళతో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి సిద్ధమయ్యాడు. మోసపోయానని గ్రహించి తీవ్ర మనస్తాపంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

