తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఘనంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
జిల్లాకు విచ్చేసిన మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ కు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తదితర అంశాలపై నాయకులు, అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆడువాల జ్యోతి లక్ష్మణ్ ఆకాంక్షలు
ఈ సందర్భంగా ఆడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన మరింత సమర్థవంతంగా కొనసాగాలని, ప్రజా సమస్యలకు వేగంగా పరిష్కారం లభించేలా పాలన ఉండాలని ఆకాంక్షించారు.
జిల్లా అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించి రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు.

