అల్లీపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పెన్షన్ పథకం కింద ఈనెల 15వ తేదీ వరకు అందిన దరఖాస్తులను మండల ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈ కె. దీపక్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు.
అల్లీపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పెన్షన్ పథకం కింద ఈనెల 15వ తేదీ వరకు అందిన దరఖాస్తులను మండల ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈ కె. దీపక్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
గ్రామంలో అందిన దరఖాస్తులపై ఈ నెల 25వ తేదీ వరకు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి, ప్రత్యేక యాప్ ద్వారా పై అధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. వారి పరిశీలన అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేస్తుందని అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ఎల్. శేఖర్, గొడ్డండ్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

