జిల్లాలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ సీ. నారాయణ రెడ్డి స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిశీలన చేపట్టారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. భూ సమస్యలు, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్య, వైద్యం, సంక్షేమం, విద్యుత్, రహదారులు తదితర వివిధ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు కలెక్టర్కు విన్నవించారు.
ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ సీ. నారాయణ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు.
ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను పెండింగ్లో ఉంచకుండా, నిబంధనల ప్రకారం పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

