జగిత్యాల జిల్లా మండలం గోవిందారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బండపల్లి జశ్వంత, జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 27 నుండి 30 వరకు మహారాష్ట్రలోని శంభోజి నగర్ లో జరగనున్న జాతీయస్థాయి పోటీలలో పాల్గొననున్నాడు.
ఈ నెల 19 నుండి 22 వరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో జశ్వంత్ పాల్గొన్నాడు. ఈ పోటీలలో అతని ప్రతిభ ఆధారంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
అభినందనలు
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా జస్వంత్ ను జిల్లా విద్యాధికారి రాము అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అస్వాక్ హుస్సేన్, ఫిజికల్ డైరెక్టర్ ప్రశాంత్, పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు యళ్ళ అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయిని పెల్లి ఆనంద్ రావు, సాఫ్ట్ బాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా అకాడమీ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి చక్రధర్ రావు, మాజీ కార్యదర్శి లక్ష్మి రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


