రాయికల్ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి వాగు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. శాంతియుతంగా వేడుకలు నిర్వహించాలని సూచించారు.
రాయికల్ పట్టణ శివారులోని వాగు వద్ద వినాయక నిమజ్జన వేడుకల కోసం మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక ఇతర శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ లు మంగళవారం పరిశీలించారు.
నిర్వాహకులకు సూచనలు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రతి ఒక్క నిర్వాహకులు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని, ఎటువంటి సంఘటనలు జరగకుండా శోభాయాత్ర, నిమజ్జనం వేడుకలు చేసుకోవాలని కోరారు.
అధికారులకు ఆదేశాలు
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పక్కా ప్రణాళికతో వేడుకలను విజయవంతం ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి కావలసిన స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు , వైద్య సేవలు, అగ్నిమాపక శాఖ, మత్స్యశాఖ అధికారులు సేవలు అందించాలని, నిమజ్జన ప్రదేశాల్లో పారిశుధ్య పనులు చేయించాలని, భారీ క్రేన్లు, చిన్న క్రేన్లు, గజ ఈతగాళ్ళు అవసరం మేరకు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైతే అదనంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
పట్టణ వాసులతో పాటు భక్తులు, పిల్లలు తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిమజ్జనం వేడుకలను భక్తులందరూ భక్తిశ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని పిలుపునిచ్చారు.
పరిశీలనలో పాల్గొన్నవారు
ఈ పరిశీలనలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డిఎస్పీ పురుషోత్తం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ టి.మనోహర్, తహసీల్దార్ నాగార్జున, ఎంపిడివో చిరంజీవి, ఎస్సై సుధీర్ రావు సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.


