భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఇంటి ఆవరణలోని బాత్రూమ్ వెనుక ఒంటిపై గాయాలతో ఆమె మృతదేహం లభించింది. ఈ దారుణానికి పక్కింటి వ్యక్తే పాల్పడ్డాడని మృతురాలి తల్లి ఆరోపించారు.
మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన హరిణి (18) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తండ్రి మరణించడంతో కూలి పనులు చేస్తూ ఇద్దరు కూతుళ్లను చదివిస్తున్న తల్లి రాజేశ్వరి. సెలవుల నేపథ్యంలో ఇటీవలే హరిణి ఇంటికి వచ్చింది.
సెలవుల నేపథ్యంలో ఇంటికి వచ్చిన హరిణి, అదే గ్రామంలోని చుట్టాల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి కనిపించలేదని తల్లి వెతకగా, ఒంటిపై గాయాలతో బాత్రూమ్ వెనుక ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పక్కింటి వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేశారు.

