చింతకాని మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా, నల్ల చెరువు కట్ట అభివృద్ధి పనులకు దాదాపు 7 కోట్ల పైగా నిధులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.
ఈ పనులకు సంబంధించి శిలాఫలకాన్ని శ్రీ మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఆవిష్కరించి, కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా చింతకాని ప్రాంతాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
శంకుస్థాపన కార్యక్రమం అనంతరం, డిప్యూటీ సీఎం చింతకాని గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు.
ఈ అభివృద్ధి కార్యక్రమాలలో చింతకాని సర్పంచ్ కిలారు మనోహర్ బాబు, ఈవో రామకోటేశ్వరరావు, గుడి చైర్మన్ ఎండపల్లి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ కోలా ఉమారాణి, మండల అధ్యక్షులు కన్నెబోయిన గోపి, మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు, కూరపాటి కిషోర్ తో పాటు పలువురు మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

