హనుమాన్ దీక్ష చేపట్టిన మెగా ప్రిన్స్, సినీ నటుడు వరుణ్ తేజ్ ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా జనసేన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వరుణ్ తేజ్‌ను సాదరంగా కలిసి స్వాగతం పలికారు.
హనుమాన్ దీక్ష చేపట్టిన మెగా ప్రిన్స్, సినీ నటుడు వరుణ్ తేజ్ ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
జనసేన నాయకులతో సమావేశం
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా జనసేన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వరుణ్ తేజ్‌ను సాదరంగా కలిసి స్వాగతం పలికారు. మీడియాతో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, జగిత్యాల జిల్లా జనసేన నాయకులను కలవడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ ప్రాంతంలో పార్టీ బలంగా ఉండటం మంచి పరిణామమని అన్నారు.
ఘన సన్మానం
అనంతరం జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు సట్ట సతీష్, అయోధ్య రామ మందిరం నుంచి తీసుకువచ్చిన శాలువాను వరుణ్ తేజ్‌కు అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యూసఫ్‌నగర్ గ్రామ ఉప సర్పంచ్, మండల ఉప సర్పంచ్ ఫోరం నాయకుడు బసవేని రమేష్, గుమ్లాపూర్ జనసేన నాయకుడు అడగట్ల సురేష్, యువ నాయకులు చిలువేరి సాయికృష్ణ, కాచం గణేష్, కొత్త వెంకటేష్, వంగల అరవింద్‌తో పాటు వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

