తెలంగాణలో గత వారం రోజుల పాటు కురిసిన వర్షాల తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. నేటి నుండి వేడి మరింత పెరిగి చాలా చోట్ల 34 నుండి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయని తెలిపారు. అయితే, ఉదయం పూట వాతావరణం చల్లగానే ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ అంతటా స్వచ్ఛమైన ఆకాశం, పొడి గాలి ఆవరించిందని వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపారు. నేటి నుండి వేడి మరింత పెరిగి చాలా చోట్ల 34 డిగ్రీల నుండి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయని ఆయన వెల్లడించారు. ఉదయం పూట వాతావరణం చల్లగానే ఉంటుందని స్పష్టం చేశారు.
వర్ష సూచన
కర్ణాటక సరిహద్దులో దక్షిణ తెలంగాణ ప్రాంతంలో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత గాలుల దిశలో మార్పులతో ఆగ్నేయ తెలంగాణలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సమీపంలో జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
వారం రోజుల క్రితం వరకు కూడా రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. వర్షాలు మొదలైన తర్వాత వాతావరణం చల్లబడింది. అయితే, మళ్లీ ఎండలు పెరగడంతో ప్రజలకు ఉక్కపోత తప్పదని, వాతావరణం ఇబ్బందులు కలిగిస్తుందని అర్థమవుతోంది.












