అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని, ఆయన ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ అన్నారు. మహాత్మాగాంధీ జయంతి వేడుకలను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ గారు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ సూచించిన శాంతి, అహింస, సత్య మార్గంలో ప్రయాణిస్తూ, నమ్మిన సిద్ధాంతాలను, విలువలను నిబద్ధతతో ఆచరించడం వల్ల ఆయన కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం అయ్యాయని అన్నారు.
స్వాతంత్రం కోసం గాంధీజి చేసిన సేవలు మరువలేనివని ఎస్పీ కొనియాడారు. భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యం అందించడం కోసం గాంధీజీ ఎంచుకున్న శాంతి, అహింస మార్గం భారతీయులకే కాదు, యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు.
దేశ అభివృద్ధి కోసం నిస్వార్థంగా సేవలు అందించాలని, ఆయన ఆశయాల సాధనకు మనందరం కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. గాంధీజీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని అన్నారు.
ఈ జయంతి వేడుకల్లో ఇన్స్పెక్టర్ అరిఫ్ అలీ ఖాన్, లు వేణు, సైదులు, లు, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.


