ఓబీసీ కులగణన సాధన, బీసీలకు సామాజిక న్యాయం కల్పించాలనే డిమాండ్‌తో ఈ నెల 4వ తేదీన శంషాబాద్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మండలం నుంచి వెయ్యి మందికి పైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుమగల్ల రమేష్ పిలుపునిచ్చారు.
కేశంపేట్ కేశంపేట్ మండలం కొత్తపేట గ్రామంలో మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో శంషాబాద్‌లో నిర్వహించనున్న ఓబీసీ కులగణన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టడంపై సమావేశంలో చర్చించారు. ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ భారీ సంఖ్యలో సభకు తరలించేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ ఫలాలు అందాలంటే వారి జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన గణాంకాలు అవసరమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కులగణన ద్వారా బీసీల వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని, వారి హక్కుల సాధనకు ఇది కీలకమైన అంశమని తెలిపారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనుమగల్ల రమేష్ మాట్లాడుతూ, ఓబీసీల హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభకు మండలం నుంచి వెయ్యి మందికి పైగా తరలివచ్చి విజయవంతం చేయాలి. ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలను సమన్వయం చేసుకుని సభకు తరలించాలి అని కోరారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామంలో జనసమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఓబీసీ కులగణన డిమాండ్‌ను బలంగా వినిపించేందుకు శంషాబాద్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్ అప్పా, మాజీ మండల అధ్యక్షుడు గూడ విరేష్, మాజీ జెడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి, కొండారెడ్డిపల్లి సర్పంచ్ పల్లె ఆనంద్ కుమార్, అల్వాల్ సర్పంచ్ సురేష్ రెడ్డి, తొమ్మిదిరేకుల సర్పంచ్ బీసా కవిత, కరుణాకర్ రెడ్డి, నిర్ధవెళ్లి సర్పంచ్ భాస్కర్ గౌడ్, బోదనంపల్లి సర్పంచ్ నగేష్, దత్తాయపల్లి సర్పంచ్ భాస్కర్, మంగలిగూడ సర్పంచ్ నరేందర్ రెడ్డి, ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల పెంటయ్య, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాణి, అనసూయమ్మ, కిసాన్ సెల్ అధ్యక్షుడు కోడూరు రాములు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇబ్రహీం, పీఏసీఎస్ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి, మనోహర్, ఏఎంసీ డైరెక్టర్ సాయిలు, వేములనర్వ డైరెక్టర్ మల్లేష్, ఆనంద్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రూప్లా నాయక్, తైద్ద పార్వతలు, ప్రకాష్ గౌడ్, నాగిళ్ల భాస్కర్, గ్యార సురేష్, చేవెళ్ల నర్సింహా, జంగయ్య, రాజు, మాజీ సర్పంచ్ వెంకటేష్, యాదగిరి చారి, అంజయ్య, మల్లేష్, నరేష్, శ్రీశైలం, సచిన్, రాజేష్, బాలాజీ, సొప్పరి జంగయ్య తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


