పోషణ మాసం పురస్కరించుకుని మైతాపూర్ అంగన్వాడీ సెంటర్ లో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను, దాని వినియోగంపై అవగాహన కల్పించారు.
మైతాపూర్ గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ లో బొమ్మెన మమత టీచర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చిన్నారుల అన్నప్రాసనతో పాటు, వారి ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం గురించి తల్లులకు వివరించారు. ఈ అన్నప్రాసన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తలారి నాగమణి, రాజేష్, ఉప సర్పంచ్ ప్రణయ్ రెడ్డి, వార్డ్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, నవీన్, పంచాయతీ కార్యదర్శి మహేష్, జిపిఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. వీరితో పాటు అంగన్వాడీ టీచర్లు పద్మలత, శాంత, ఆశ వర్కర్స్ శంకరమ్మ, గంగనర్సు, తులసి, మమత మరియు చిన్నారుల తల్లులు కూడా హాజరయ్యారు.


