రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాల్లో రొటేషన్ పద్ధతిని అమలు చేయాలని, మాదిగలతో పాటు వారి ఉపకులాలకు చెందిన అర్హులైన జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి సర్వని శ్రీనివాస్ కోరారు. ఎస్సీ వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టులకు కమిషన్లో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా వారి సమస్యలపై అవగాహన పెరుగుతుందని ఆయన తెలిపారు.
రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాల్లో రొటేషన్ పద్ధతిని అమలు చేసి, మాదిగలతో పాటు, మాదిగ ఉపకులాలకు చెందిన అర్హులైన జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి సర్వని శ్రీనివాస్ కోరారు. ఎస్సీ వర్గాల సమస్యలను సమర్థవంతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న జర్నలిస్టులకు ఎస్సీ కమిషన్లో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ఆయా వర్గాల సమస్యలపై, ఆయా వర్గాల అభివృద్ధికి మరింత పాటుపడుతూ, వారి సమస్యలపై పూర్తి అవగాహనతో చర్చకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఎస్సీ కమిషన్ నియామకాల్లో ప్రభుత్వం సామాజిక న్యాయం, సముచిత ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సర్వని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. మాదిగలతో పాటు మాదిగ ఉపకులాలకు చెందిన అర్హత, అనుభవం కలిగిన జర్నలిస్టులను కమిషన్లో భాగస్వాములుగా చేయాలని ఆయన కోరారు.

