హైదరాబాద్‌లోని మెహదీపట్నం జీహెచ్ఎంసీ గోల్కొండ జోన్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సునీత తులసీరామ్ రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆమె రూ.8 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
హైదరాబాద్‌లోని మెహదీపట్నం (జీహెచ్ఎంసీ గోల్కొండ జోన్) టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సునీత తులసీరామ్ రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడి భవన నిర్మాణ పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసేందుకు, డిప్యూటీ కమిషనర్ ఆదేశాలను పక్కనపెట్టి సహకరించేందుకు ఆమె మొత్తం రూ.8 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది.
ముందస్తు ప్రణాళికలో భాగంగా తొలి విడతగా రూ.4 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె వద్ద లంచం డబ్బు రూ.4 లక్షలతో పాటు, లెక్కచూపని మరో రూ.2.50 లక్షల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులెవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు లేదా 9440446106 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ విజ్ఞప్తి చేసింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపింది.


