డోర్నకల్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. మండలం పెద్దనాగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరికలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
పెద్దనాగారం గ్రామానికి చెందిన చలమల్ల భాస్కర్ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. అలాగే, అజ్మీర తండా గ్రామపంచాయతీకి చెందిన లూనావత్ లక్ష్మీ, బానోత్ వెంకన్న, మోహన్ తదితరులు కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
మరిన్ని చేరికలు ఉంటాయని అంచనా
పెద్దనాగారంలో జరిగిన ఈ చేరికల నేపథ్యంలో డోర్నకల్ నియోజకవర్గంలో రాజకీయ చర్చకు తెరలేచింది. డీఎస్ రెడ్యానాయక్‌కు నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న వ్యక్తిగత పరిచయాలు, అభిమానులు, కార్యకర్తలతో ఉన్న బలమైన అనుబంధమే ఆయనకు అండగా నిలుస్తోందని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు.
ఇంకా చాలామంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరాల్సి ఉంది. అందుకు ఒక సమయం ఉంటుంది. ప్రస్తుతం కొందరు వేచి చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు మరిన్ని చేరికలు జరుగుతాయి అని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు తమ మనసులోని మాటను చర్చించుకుంటున్నారు. డోర్నకల్ నియోజకవర్గం మొత్తం ఇదే చర్చ జరుగుతుందని స్థానిక ప్రజలు భావిస్తున్నారు.

