శ్రీశ్రీశ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం చెరువుగట్టులో అమావాస్య సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
అమావాస్య పురస్కరించుకొని చెరువుగట్టు దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని గిరిప్రదక్షిణ చేసి, వారి కృపకై ప్రార్థించారు. గుట్టంతా భక్తిశ్రద్ధలతో భగవంతుని నామస్మరణతో మారుమోగింది. భజనలు, ఆటపాటలతో గిరిప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా సాగింది.
ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని ఉంద్యాల ప్రకాష్ రెడ్డి తెలిపారు. ధర్మాచార్య సంపర్కం గురించి ఆయన ప్రస్తావించారు. భక్తితో కూడిన వాతావరణంలో అందరూ శివనామస్మరణ చేస్తూ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.
ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో బెల్లం యాదగిరి, బజరంగ్దళ్, నరసింహ గురుస్వామి వెంకటయ్య, నాగరాజు, గుండగోని శ్రీ శ్రావణి, పద్మ, లక్ష్మి, ప్రభాకర్, సుధాకర్ రెడ్డి, శంకర్, ప్రవీణ్ తో పాటు అధిక సంఖ్యలో భక్తులు, కార్యకర్తలు, బంధువులు పాల్గొన్నారు.

