మండలం చెర్వుగట్టు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ముత్యాలమ్మ గుడి వద్ద మహిళల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
చెర్వుగట్టు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ముత్యాలమ్మ గుడి వద్ద కాలనీ మహిళల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెర్వుగట్టు సర్పంచ్ నేతకానీ కృష్ణయ్య, జిల్లా నాయకులు రేగట్టే నవీన్ రెడ్డి, నడింపల్లి శ్రీను స్వామి, వార్డు సభ్యుడు కూకుట్ల శ్రీకాంత్, మాజీ వార్డు సభ్యులు గంట శేఖర్, వంపు శివ, వంపు లింగయ్య, కూకుట్ల బుచ్చిరాములు, కట్ట రమేష్, కాలనీ మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, మహిళల ఆనందోత్సాహాల మధ్య జరిగిన బతుకమ్మ వేడుకలు సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పాయి.

