సమాచార హక్కు చట్టం ( , 2005) అమలులో రాష్ట్రస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను సూర్యాపేట జిల్లాకు అవార్డు లభించింది. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా చేతులమీదుగా ఈ అవార్డును జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నంద్ లాల్ పవార్, ఐఏఎస్ అందుకున్నారు.
ఈ జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నంద్ లాల్ పవార్, ఐఏఎస్ గారిని జిల్లా ఎస్పీ శ్రీ కె. నరసింహ, ఐపీఎస్ గారు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో, సమాచార హక్కు చట్టం అమలులో జిల్లా యంత్రాంగం కనబరిచిన పనితీరుకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ నాయకత్వంలో సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపి, జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించడం, ప్రభుత్వ శాఖల పనితీరులో పారదర్శకతను పెంపొందించడం, ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపడం వంటి అంశాల్లో జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఎస్పీ కొనియాడారు. ఈ జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సమర్థవంతమైన పరిపాలనలో జిల్లా యంత్రాంగం మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.












