జగిత్యాల జిల్లా మండలం అల్లీపూర్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అమ్మవారు భక్తులకు శాకాంబరి దేవి అవతారంలో దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని అత్యంత రమణీయంగా అలంకరించారు.
జగిత్యాల జిల్లా మండలం అల్లీపూర్ గ్రామంలో శ్రీ దుర్గా భవాని సేవా సమితి, నేతాజీ యూత్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అమ్మవారు భక్తులకు శాకాంబరి దేవి అవతారంలో దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని అత్యంత రమణీయంగా అలంకరించారు.
ఈ సందర్భంగా పురోహితులు అంగడి భువనేశ్వర్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో విగ్రహ దాత అనుమల్ల విజయ్ - వసుధ దంపతులు, భవాని స్వాములు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యూత్ సభ్యులు, భవాని దీక్షా స్వాములు, గ్రామ మహిళలు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.











