తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వరి పంట కోతలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో, రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యం విక్రయించేలా వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీజేపీ యువమోర్చా డిమాండ్ చేసింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది.
రైతులు తమ కష్టార్జిత ధాన్యాన్ని దళారులను నమ్మి తక్కువ ధరలకు విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించి మంచి లాభాలు పొందేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాము.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు వరి ధాన్యంపై ప్రకటించిన బోనస్‌తో పాటు కనీస మద్దతు ధరను అందించాలని బీజేపీ యువమోర్చా నాయకులు కోరారు.
రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునే పరిస్థితులు లేక ఇబ్బందులు పడకుండా, ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి జాప్యం లేకుండా ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, రైతులకు చెల్లింపులు కూడా త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ మేరకు కోరుట్ల పట్టణ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు దమ్మ సంతోష్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ప్రయోజనాలను కాపాడాలని ఆయన కోరారు.

