జగిత్యాల పట్టణంలో అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో 18వ నెల అమావాస్య అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్య వైశ్య భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 1500 మందికి పైగా ప్రజలు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సేవా కార్యక్రమం సమాజంలో మానవతా విలువలను పెంపొందిస్తుందని పలువురు కొనియాడారు.
జగిత్యాల పట్టణంలోని అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి వారు ప్రతినెలా అమావాస్య రోజున అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. ఈ అన్నదానం మహాదానం అనే స్ఫూర్తితో, జగిత్యాల పట్టణంలోని అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా 18వ నెల అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని పట్టణంలోని ఆర్య వైశ్య భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు, పరిసర ప్రాంతాల ప్రజలకు అన్నప్రసాదాన్ని అందజేశారు. సుమారు 1500 మందికి పైగా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముదుఘంటి రవీందర్ రెడ్డి పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్నం పంచితే ఆకలి తీరుతుంది.. ఆప్యాయత పంచితే మానవత్వం వెలుగుతుంది. ఆకలితో ఉన్న వారికి అన్నం అందించడం కంటే గొప్ప సేవ మరొకటి లేదన్నారు. ప్రతి నెల అమావాస్యను పురస్కరించుకుని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే భావనను ఆచరణలో చూపుతున్న చకినం ప్రసాద్, వారి సహచర బృందంతో చేస్తున్న కార్యక్రమం చాలా గొప్పదని అన్నారు.
ఏసీఎస్ రాజు మాట్లాడుతూ, సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, ప్రతి ఒక్కరికీ ఆహారం అందించాలనే మానవతా దృక్పథాన్ని చాటడమే గొప్ప కార్యక్రమం అని అన్నారు. ఈ సందర్భంగా సమితి చైర్మన్ చకినం ప్రసాద్ మాట్లాడుతూ.. అన్నం పంచితే ఆకలి తీరుతుంది.. ఆప్యాయత పంచితే మానవత్వం వెలుగుతుంది. ఆకలితో ఉన్న వారికి అన్నం అందించడం కంటే గొప్ప సేవ మరొకటి లేదన్నారు. ప్రతి నెల అమావాస్య రోజున పెద్దల జ్ఞాపకార్థం గా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆధ్యాత్మిక విశ్వాసంతో పాటు సామాజిక సేవకు ప్రాధాన్యతనిస్తూ నిరంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అన్నదానాన్ని పలువురు స్వీకరించి నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో అన్నదానం, సేవాభావం, మానవతా విలువలు మరింత బలపడతాయని కొనియాడారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సమితి సభ్యులు, సేవా కార్యకర్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో చకినం ప్రసాద్, గంప రాములు, మురికి వెంకట రమణ, ఊటూరి లవకుమార్, బోనగిరి సురేష్ కుమార్, పాలకూర్తి రమేష్, కోటగిరి శ్రీనివాస్, గంప రమేష్, ఏన్నాకుల శ్రీకాంత్, మానేరు సురేష్, ఒరుగంటి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

