కోరుట్ల పట్టణంలో రోజురోజుకూ మైనర్ యువకుల ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, అతివేగం, అధిక శబ్దం చేసే మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగం పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోందని కోరుట్ల పట్టణ బీజేవైఎం అధ్యక్షులు ధమ్మ సంతోష్ రెడ్డి తెలిపారు.
మైనర్ల చేతుల్లో ద్విచక్ర వాహనాలు ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో కొందరు యువకులు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులకు కూడా అధికారులు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ధమ్మ సంతోష్ రెడ్డి కోరారు.
ప్రజల ప్రాణాల భద్రత దృష్ట్యా కోరుట్ల పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేసి, మైనర్ల రాష్ డ్రైవింగ్‌కు అడ్డుకట్ట వేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నామని తెలిపారు.
రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని ఆయన అన్నారు.

